ఉప్పల్ బీజేపీ టికెట్ పై ఉత్కంఠ..!
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కానీ ఎన్నికలు సమీపించడంతో బీజేపీ మాత్రం ఉప్పల్లో తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
దిశ, నాచారం : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కానీ ఎన్నికలు సమీపించడంతో బీజేపీ మాత్రం ఉప్పల్లో తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇతర పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు.. అయోమయంలో ఉన్నారు.
తెరపై కొత్త నేతలు..
బీజేపీ ఎన్నికల అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉప్పల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటు బీజేపీలో ఉప్పల్ సీటు పై పలువురు నాయకులు ఆశిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించక పోవడంతో ఇటీవల బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పునరా ఆలోచనతో పాటు.. స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ కారణంగా బీజేపీ పార్టీ కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే కూడా అంతా ఆసక్తి లేనట్లు తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంతో.. బీజేపీ తన వ్యూహాన్ని ఇతర పార్టీల అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ప్రకటించడానికి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నట్లుగా సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వగా.. బీజేపీలో మాత్రం బలమైన బీసీ వర్గానికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
టీడీపీ, జనసేన పొత్తు..?
బీజేపీ పార్టీ జనసేనతో జతకట్టడానికి సిద్ధమైంది. దీంతో పాటు తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉండటంతో.. ఆ దిశగా కూడా పొత్తుకు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఒకవేళ పోతే కుదిరితే ఉప్పల్ సీటు ను టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ అభ్యర్థిని బరిలో దించడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.