బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయండి..
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ డిమాండ్ చేశారు.
దిశ, ఉప్పల్: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ డిమాండ్ చేశారు. శనివారం ఉప్పల్ రింగ్ రోడ్డులో బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తుందని, మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించలేకపోతుందని అన్నారు.
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకుంటాలేరని మండిపడ్డారు. ఉప్పల్ రింగ్ రోడ్ లో రెజ్లర్లకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి సంఘీభావం తెలిపారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్, మేకల హనుమంత్ రెడ్డి, ఎదుల్ల కొండల్ రెడ్డి, కొక్కొండ జగన్, శ్యామ్, బాలు తదితరులు పాల్గొన్నారు.