సెల్యూట్ చేస్తే లాఠీ వాత..

పోలీసు శాఖలో సెల్యూట్ కు అతి పెద్ద గౌరవం.. అలాంటిది ఒక గన్ మెన్ సెల్యూట్ చేస్తుంటే అతని పైనే లాఠీని ఝలిపించాడు రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రఘువీర్.

Update: 2023-12-01 06:41 GMT

దిశ, రాచకొండ : పోలీసు శాఖలో సెల్యూట్ కు అతి పెద్ద గౌరవం.. అలాంటిది ఒక గన్ మెన్ సెల్యూట్ చేస్తుంటే అతని పైనే లాఠీని ఝలిపించాడు రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రఘువీర్. పోలింగ్ సందర్భంగా ఆదిబట్ల పీఎస్ పరిధిలో బీజేపీ అభ్యర్థికి గన్ మెన్ ని పోలీసు అధికారి లాఠీతో కొట్టాడు. అతను వివరిస్తున్నా వినకుండా ఇన్స్పెక్టర్ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు పీఎస్ఓ అధికారుల్లో కలవరం రేపింది.

ప్రభుత్వం కేటాయింపు మేరకు తాము వ్యక్తిగత భద్రతకు పని చేస్తు రక్షణకు నిలబడే తమ పై ఇన్స్పెక్టర్ లాఠీ ఝులిపించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ రఘువీర్ పై చర్యలు తీసుకోవాలని పీఎస్ఓ అధికారుల వర్గాల్లో డిమాండ్ పెరుగుతుంది. మరో వైపు రఘువీర్ వ్యవహారం పోలీసు అధికారుల్లో చర్చకు దారి తీసింది. కేవలం పొలిటికల్ పవర్ ఉందనే ధీమాతోనే అతని వ్యవహార శైలి వేరుగా ఉంటుందనే విమర్శలు పోలీసు వర్గాలలోనే విసతృతంగా ఉంది. గతంలో పని చేసిన చోట అనేక ఆరోపణలు ఎదురుకున్నారని తోటి పోలీసు అధికారులే వివరిస్తున్నారు. అయ్యితే ఈ ఇన్స్పెక్టర్ పై చర్యలు ఉంటాయా.. పొలిటికల్ ఒత్తిడికి మాఫ్ చేస్తారా వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News