సైనస్‌తో బాధపడుతున్న వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స..
దీర్ఘకాలంగా సైనస్‌తో బాధపడుతున్న 46 ఏండ్ల వయస్సు ఉన్న హుస్సేన్ అనే వ్యక్తికి కూకట్పల్లి అమోర్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి సైనస్ నుంచి విముక్తి కల్పించారు.
దిశ, కూకట్పల్లి: దీర్ఘకాలంగా సైనస్‌తో బాధపడుతున్న 46 ఏండ్ల వయస్సు ఉన్న హుస్సేన్ అనే వ్యక్తికి కూకట్పల్లి అమోర్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి సైనస్ నుంచి విముక్తి కల్పించారు. ఫంక్షనల్ఎండోస్కోపి సైనస్ సర్జరి(ఫేస్) ప్రక్రియ ద్వారా అత్యంత క్లిష్టమైన అత్యాధునిక, సాంకేతికమైన సర్జికల్ నేవిగేషన్ విధానాన్ని వినియోగించి శస్త్ర చికిత్సను నిర్వహించినట్టు అమోర్ ఆసుపత్రి వైద్యులు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. ప్రత్యేక విధానం ద్వారా తల లోపలి భాగంలో ఉన్న కీలకమైన భాగాలను చూస్తూ, ఎథ్మాయిడ్ సైనసైటిస్‌ను సరిచేయడం జరిగిందని తెలిపారు.
46 ఏండ్ల వయసు ఉన్న రోగి ఎథ్మాయిడ్ సైనసైటిస్‌తో బాధపడుతున్నారని అన్నారు. సమస్యను అలాగే వదిలేస్తే చాలా ప్రమాదరకరమైన పరిణామాలు ఎదురవుతాయని, సైనస్ కళ్లకు, పుర్రెకు సమీపంలో ఉన్నాయని అన్నారు. ఆ ప్రాంతాలకు వెళ్లి, ఇన్ఫెక్షన్ సోకిన పలు పొరలను తొలగించడానికి అత్యాధునిక పరికరాలను వినియోగించడం జరిగిందని డాక్టర్ప్రవీణ్ తెలిపారు.