మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్

మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Update: 2023-05-18 09:15 GMT

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకని  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్  డిమాండ్ చేశారు. గురువారం మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద ఎన్ఎస్ యూఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ హాజరై మాట్లాడారు.  మేడ్చల్ లో డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు చదువుకునేందుకు కిలోమీటర్ల మేర ప్రయాణాలు చేసి కాలేజీలకు వెళ్తున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని మంత్రి మల్లారెడ్డి నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడ్చల్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేదుగాని మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ కళాశాల ఏ విధంగా తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకుంటే విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్, రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త గొన్న మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు పోచయ్య, మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ చాప రాజు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మహమ్మద్ షాఫిరుద్దీన్, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మహేష్, మేడ్చల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, రంజిత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News