ఏడుపాయల జాతర నేపథ్యమేంటి..? ఈ జాతరను ఎప్పటి నుంచి జరుపుతున్నారు..??

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం శివరాత్రి జాతరకు... Yedupayala Jatara arrangements are going on

Update: 2023-02-17 13:32 GMT

దిశ, కొల్చారం: వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం శివరాత్రి జాతరకు ముస్తాబు అవుతున్నది. మునుల తపోభూమిగా జనమే జయిని సర్పయాగస్థలిగా గుర్తింపు పొందిన ఏడుపాయల మహాశివరాత్రి జాతరకు ముస్తాబు అవుతున్నది.

ఏడుపాయల స్థల చరిత్ర:

ఏడుపాయలకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. పూర్వం భారతదేశాన్ని పాలించిన పరీక్షిత్తు మహారాజు పాముకాటుకు గురై మృతిచెందాడు. పరీక్షిత్ మారాజు మృతికి పాము కారణమని భావించిన ఆయన కుమారుడు జనమేజయుడు భూమండలంలోని పాములన్నిటిని చంపడానికి ఏడుపాయల ప్రాంతంలో సర్పయాగాన్ని చేపట్టాడు. ఈ సర్పయాగంలో పడి ఎన్నో పాములు చనిపోయాయి. చివరకు మహావిష్ణువు పవళించే ఆదిశేషువు కూడా సర్పయాగంలో పడడానికి తరలివస్తుండగా భగీరథుడు ఎలాగైనా జయమే దేవుడు చేపట్టిన యాగాన్ని చెప్పండి సర్పయాగాంధీ భగ్నం చేయడానికి దివి నుండి భూమికి గంగను తీసుకోవచ్చాడు ఈ గంగా నది మందిర నదిగా ఇక్కడి ప్రాంత ప్రజలు భావిస్తారు మాజీ రన్నది ఏడుపాయలుగా చీలి సర్పయాగ కుండలాలు జలమయమయ్యాయి. దీంతో సర్పయాగం భగ్నమైంది. ఏడుపాయల మధ్యలో వెలిసిన దుర్గామాత వద్ద ఎంతోమంది ముందులు తపస్సు చేసి తరించారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో మునిపుట్ట జనమేజయుడు చేసిన సర్పయాగస్థలి జీరా నది తీరంలోని ఏడుపాయల భాగంలో పేరూరు వద్ద సరస్వతి ఆలయం సమీపంలో కనిపిస్తుంది. ఇక్కడ మంజూరు నది తీరంలో తొవ్వితే విభూతి ఇప్పటికీ వస్తుంది.


రాష్ట్రంలోని అతిపెద్ద జాతర ఏడుపాయల జాతర:

రాష్ట్రంలోని అతిపెద్ద జాతరగా గుర్తించబడిన ఏడుపాయల జాతర ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తింపు పొందిన ఏడుపాయల జాతరలో భక్తులకు కావలసిన వసతుల కల్పనలో జిల్లా అధికార యంత్రాంగం తల మునుకలైంది. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల వనదుర్గ మాత జాతర గుర్తింపు పొందింది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, బాలనగర్, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారులోని టేకుల గడ్డ వద్ద ఆర్టీసీ బస్టాండు, వాహనాల పార్కింగ్ స్థలం కేటాయించారు. నారాయణఖేడ్, జహీరాబాద్, పెద్ద శంకరంపేట, బీదర్ తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం పాపన్నపేట మండలం నాగ్స్నపాల్లి శివారులోని చెలిమెలకుంట సమీపంలో సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.


జాతరలో ముమ్మర ఏర్పాట్లు:

మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతరకి దేవాదాయ శాఖ అధికారులు వివిధ శాఖల సిబ్బందితో కలిసి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా నేతృత్వంలో జిల్లాలోని వివిధ గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులతో జాతరలో పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు.

ఏడుపాయల జాతర కు 138 బస్సు సర్వీసులు: సుదర్శన్, రీజనల్ మేనేజర్, సంగారెడ్డి రీజియన్

జాతర సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్టాండ్ లను ఆర్టీసీ సంగారెడ్డి రీజినల్ మేనేజర్ సుదర్శన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఏడుపాయల జాతర సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలవకుండా 138 బస్సు సర్వీసులు వివిధ ప్రాంతాల నుండి నడపనున్నట్లు ఆర్ఎం సుదర్శన్ తెలిపారు. జాతరలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్లలో వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసౌకర్యం కలవకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో బస్ లు నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో వచ్చే భక్తులు టేకుల గడ్డ వద్ద నుండి ఆలయానికి వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం తెలిపారు.


జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేస్తున్నాం: బాలా గౌడ్, ఏడుపాయల వనదుర్గమాత ఆలయ కమిటీ చైర్మన్

మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా మంత్రి హరీష్ రావుల సహకారంతో ఏడుపాయల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం.

Tags:    

Similar News