మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్ వల్లూరు క్రాంతి

మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు పారిశ్రామిక

Update: 2024-06-28 14:46 GMT

దిశ,సంగారెడ్డి : మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సాధికారత పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మహిళా క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, మహిళా సంఘాల చే ఏకరూప దుస్తుల తయారీ దీనికి నిదర్శనమన్నారు.

చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ, మీసేవ లాంటి పథకాలకు డిసెంబర్ చివరి నాటికి మహిళలను ఎంపిక చేయాలని, బ్యాంక్ లింకేజ్ కి అనుసంధానం చేయబడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళా సాధికారత ఈ ప్రభుత్వ లక్ష్యమని మహిళలకు పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి మహిళా క్యాంటీన్ ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలలో నిర్మాణ పనులు, పాఠశాల అంగన్వాడి విద్యార్థుల కోసం ఏక రూపు దుస్తుల తయారీ లాంటి కార్యక్రమాలను అందించడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థిక క్రమశిక్షణలతో కోటీశ్వరులు కావాలని, ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ డీఓ పీడీ జ్యోతి, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News