కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: జగ్గారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్నిస్వాగతిస్తున్నానని, ఇది ఎంతో మంచి నిర్ణయమని....Welcomes KCR's decision: Jaggareddy

Update: 2022-09-20 11:59 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్నిస్వాగతిస్తున్నానని, ఇది ఎంతో మంచి నిర్ణయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం మంచి నిర్ణయం అని, ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించదు.. అన్ని వర్గాలు హర్షిస్తున్నాయన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్ పీ కోరిన సందర్భాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. బీజేపీ తప్ప మిగతా పార్టీలు తీర్మాణం చేశాయన్నారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టి ప్రదాని నరేంద్రమోడీ రాజ్యంగ నిర్మాత రుణం తీర్చుకోవాలన్నారు. నెహ్రూ క్యాబినెట్ లో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరికి మార్గదర్శకుడేనని, బీజేపీ నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడుతుందా..? లేక ఆ పార్టీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారో చూడాలి అని జగ్గారెడ్డి అన్నారు.


Similar News