బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం బస్వవేశ్వర మహారాజ్‌ 890వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Update: 2023-04-23 14:31 GMT

దిశ, అందోల్: బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం బసవేశ్వరుడి మహారాజ్‌ 890వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జోగిపేటలోని బసవేశ్వరుడి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది మహాత్మ బసవేశ్వరుడని ఆయన కొనియాడారు.

సమ సమాజ స్థాపన కోసం, సాంఘిక సంస్కరణల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం ఆయనను లింగాయత్‌ సమాజం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. బస్వవేశ్వర విగ్రహం వద్ద మెట్ల ఏర్పాటుకు అయ్యె ఖర్చును తానే భరిస్తానని మున్సిపల్‌ 17వ వార్డు కౌన్సిలర్‌ ప్రకటించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ అధికారులు బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల మహేశ్వర్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ లు మన్సాన్పల్లి మల్లికార్జున్, డీబీ.నాగభూషణం, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు సార శ్రీధర్, మాజీ అధ్యక్షులు చాపల వెంకటేశం, మాజీ కౌన్సిలర్‌ తుపాకుల సునీల్, బీఆర్‌ఎస్‌ నాయకులు బీర్లా శంకర్, కన్నా అనిల్‌ రాజ్, నాగరాజు, లింగాయత్‌ సమాజం నాయకులు సత్యవ్రత్, రమేష్‌ అప్ప, రవి, రాజేందర్, రాజు, రమేష్, వీరేశం, భద్రప్ప, శివ, సాయి, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News