యథేచ్ఛగా గుట్కా దందా..పట్టణాల నుంచి పల్లెలకు రవాణా

నిషేధిత గుట్కా విక్రయాలు నారాయణఖేడ్ డివిజన్ లో యథేచ్ఛ

Update: 2024-07-04 14:10 GMT

దిశ, నారాయణఖేడ్: నిషేధిత గుట్కా విక్రయాలు నారాయణఖేడ్ డివిజన్ లో యథేచ్ఛగా గుట్కా సాగుతున్నాయి. చాప కింద నీరులా ప్రజారోగ్యాన్ని గుట్కా మహమ్మారి పట్టిస్తుంది. యువత గుట్కా కు బానిసై క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోని ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్కా విక్రయాలు ను బ్యాన్ చేసిన కొందరు అక్రమార్కులు విక్రయాలు చేపడుతున్నారు. పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. కిరాణా, పాన్ డబ్బులు, హోటల్ లక్ష్యంగా విక్రయాలు చేపడుతున్నారు. నారాయణఖేడ్ పట్టణం తో పాటు, నారాయణఖేడ్, కల్లేరు, కంగ్టి, మానూర్, నాగల్ గిద్ద , నిజాంపేట్, సిర్గాపూర్ , పెద్ద శంకరంపేట మండలాలలో ని గ్రామాలలో మూడు పువ్వులు ఆరు కాయలుగా గుట్కా వ్యాపారం కొనసాగుతోంది.

ఈ దందాలో రూ. లక్షలు చేతులు మారుతున్నట్లు సమాచారం. అధికారుల తనిఖీలు నామమాత్రంగా చేపట్టడంతోనే వ్యాపారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గుట్కా వ్యాపారులు నుంచి అధికారులు నెల వారి మామూళ్లు ముడుతుండడంతో నే చూచి చూడనట్టుగా వ్వవ హరిస్తున్నారనే వాదనలు హరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యానికి హాని చేసే గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్చిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గుట్కాపై నిషేధం విధించింది. యువత మొదలుకొని వృద్ధుల వరకు గుట్కా తినడంతో క్యాన్సర్ తో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుట్కా, పాన్ మసాలా పై ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. కానీ, కొంతమంది రాజకీయ పలుకుబడితో ఈ దందాను సాగిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన ప్పటికీ కిరాణం, హోటల్, పాన్ షాపుల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గుట్కా దందా నారాయణఖేడ్ పట్టణంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ దందాలో రూ. లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. నారాయణఖేడ్ పట్టణంలో ప్రతి కిరాణా దుకాణంలో గుట్కా ప్యాకెట్లలో ఉంటాయి. కానీ కిరాణా దుకాణం యజమానులు దొరక నివ్వకుండా దాచిపెడతారు. హోటల్, పాన్ షాపుల్లో బహిరంగంగానే అమ్ముకుంటున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు బానిస అవుతున్నారు. కానీ లో కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న ముఠా సభ్యులు ప్రభుత్వం నిషేధం విధించిన అంతా సులువుగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. గుట్కా రవాణా పట్టణంతో పాటు మారుమూల ప్రాంతాలకు చేరుకుంది. ఈ దందా పోలీసులు అండదండలతో నడుస్తున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గుట్కా కు బానిసైన యువత..

యువతకు బానిసై అయిపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నోట్లో గుట్కా, పాన్ మసాలా లేకుండా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వం నిషేధం విధించడంతో రూ.10 గుట్కను రూ.20 చొప్పున దుకాణాలు పాను డబ్బాల్లో యథేచ్ఛగా గుట్కా విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. చాలామంది గుట్కా తినడం తో నోటి క్యాన్సర్ ను బారిన పడుతున్నారు. ప్రభుత్వం బ్యాన్ చేసిన ఇప్పటికే పలుచోట్ల కిరాణా షాప్ లో లభిస్తుంది.

నిఘా పెడితేనే అడ్డుకట్ట...

గుట్కా రవాణాపై నిఘా పెడితేనే అడ్డుకట్ట వేయచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. గుట్కా రవాణా చేస్తే ముఠా కాలేజీ బ్యాగుల్లో సరుకును షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నారాయణఖేడ్ 35 కిలోమీటర్ల దూరంలో ఉండడంతోనే గంటలోనే అక్కడి నుంచి కారు, బొలెరో, ఇతర వాహనాలో తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా పెద్ద పెద్ద కిరాణా దుకాణంలో విక్రయిస్తారు. అక్కడి నుంచి నారాయణఖేడ్, కల్లేరు, కంగ్టీ, మనూర్, నగాల్ గిద్ద, సిర్గాపూర్, నిజాంపేట, పెద్ద శంకరంపేట మండలాలకు గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు.

కొంతమంది ముఠాగా ఏర్పడిన ఆ దందాలో రూ. లక్షలలో చేతులు మారుతున్నట్లు వినికిడి. నారాయణఖేడ్ డివిజన్ లో గుట్కా కు బానిసై మూడు సంవత్సరాల్లో 20 పైనే మరణించారు. ముగ్గురు నాలుక ను సగం వరకు తీసివేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ బ్రతుకుతెరువు లేక వలస ఇప్పుడు ఇంటి పక్కనే ఉండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.


Similar News