మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం

మట్టి స్థానం మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు.

Update: 2024-07-07 07:04 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మట్టి స్థానం మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో యోగా గురువులు బొజ్జ ఆశోక్, ఎలిగేటి కృష్ణమూర్తి, పెద్ది మనోహర్ ఆధ్వర్యంలో మట్టి స్థానం కార్యక్రమం నిర్వహించారు. మొదట కార్యక్రమానికి హాజరైన వారితో సూక్ష్మ యోగా ఆసనాల సాధన చేయిస్తూ ఉపయోగాలను వివరించారు. మట్టి స్నానం వలన కలిగే ఉపయోగాలు బోధించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో మట్టి స్నానం చేయించారు. ఈ సందర్భంగా ఆది యోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ ఆచార్యులు యోగా వంశీకృష్ణ మాట్లాడుతూ...పురాతన కాలంలో నుంచి మట్టి స్నానం ఆచరించే వారన్నారు.

ఆధునిక కాలంలో అనేక చర్మ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న వారు మట్టి స్నానం ఆచరించడంతో ఉపశమనం లభిస్తుందన్నారు. మట్టి స్నానంతో శరీర ఉష్ణోగ్రత తగ్గించడంతో పాటు, మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ఆది యోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిద్ది రాములు, తుల్జాపూర్ వినోద్ ప్రతి నెల నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు మట్టి స్నానం నిపుణులు గురూజీ, శ్రీనివాస్, ప్రభుదాస్, కడవేర్గు రమేశ్ బాబు, కత్తుల బాపురెడ్డి, జూలూరి రవికుమార్, దేవేందర్ గౌడ్, సముద్రాల శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, రామచంద్రం, కూతురు రాజిరెడ్డి, శ్రీనివాస చారి, నాయిని సంజీవరెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రం, రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ శిక్షకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.


Similar News