వనమహోత్సవం లక్ష్య సాధనకు కృషి చేయాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

వనమహోత్సవ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో

Update: 2024-07-06 13:48 GMT

దిశ,సంగారెడ్డి : వనమహోత్సవ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ కమీషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వనమహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.

ప్రధానంగా ప్రస్తుత 2024 సీజన్ లో ఆయా శాఖల వారీగా వనమహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీలకు, గ్రామీణ ప్రాంతాల్లో 35లక్షల 880 మొక్కలు నాటాల్సిన లక్ష్యాలను గుర్తు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో గ్రామా పంచాయతీల వారీగా నాటిన మొక్కల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్లు , మోడల్ స్కూల్స్ , ప్రాగణాలల్లోనూ కేజీబీవీ కళాశాలల్లోనూ నిర్ణీత గడువు లోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. లక్ష్యాల సాధన కోసం అనువైన స్థలాలను గుర్తిస్తూ, మొక్కలు నాటడంతో పాటు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని, ఏకకాలంలో ఈ పనులు జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డిఏ పీడీ జ్యోతి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓ వీరేంధర్ బాబు, డీ పీఓ సాయి బాబా, జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News