చలో రాజ్ భవన్ .. భారీగా తరలిన నీలం మధు అనుచర వర్గం..
అదానీ ఆర్థిక కుంభకోణం తో పాటు మణిపూర్ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వ
దిశ, పటాన్ చెరు : అదానీ ఆర్థిక కుంభకోణం తో పాటు మణిపూర్ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్ రోడ్డు లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు చేపట్టిన ఈ భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పటాన్ చెరు నుంచి భారీ వాహనశ్రేణితో నీలం మధు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుండి నడిపించిన ఈ కార్యక్రమంలో మిగతా నాయకులతో కలిసి పాల్గొన్నారు.