రైతులకు ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయాలి : వీసీ దండ రాజిరెడ్డి

రైతులకు ఆదాయాన్ని పెంచే పంటలు సాగు చేయాలని

Update: 2024-12-18 16:26 GMT

దిశ,ములుగు: రైతులకు ఆదాయాన్ని పెంచే పంటలు సాగు చేయాలని వైస్ ఛాన్స్లర్ దండ రాజిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా, మండల కేంద్రమైన ములుగు లోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో కే. వీ. కే, రామగిరి జిల్లా లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులకు హార్టికల్చర్ యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ... మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండేటట్టు కూరగాయల ఉత్పత్తి చేసేలా రైతులకు రక రకాల సంకరాలు దానికి సంబంధించిన సాంకేతికతను రైతులకు చేరవేరేలా పరిశోధనలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

వర్సిటీ కూరగాయలు, పనులు పువ్వులు సాగు మిగతా వ్యవసాయ పంటల కన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులకు ఆదాయాన్నిచ్చే పంటలను సాగు చేసే దిశగా ప్రయత్నం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ ఆఫ్ ఐటిఎఆర్ఐ - ఐసిఎఆర్, జోన్- ఎక్స్ షేక్, ఎన్, మీరా మాట్లాడుతూ.. కూరగాయలలో అంటూ కట్టిన మొక్కలను సాగు చేయడం భూమి నుండి వచ్చే వ్యాధులను తట్టుకొని అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారని అలా కాకుండా రైతులు ఇక్కడినే రాష్ట్రానికి సరిపడా కూరగాయలు పండించడానికి సాగుల అవసరమైన సాంకేతికతలు అంటు కట్టే పద్ధతి విధానం మీద శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో ఎయిర్ లూమ్స్ సిడ్లింగ్స్ అండ్ ప్లాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి విచ్చేసిన కృష్ణ కిషోర్ మాట్లాడుతూ.. కూరగాయల్లో అంటు కట్టే పద్ధతి ఉత్పత్తి నాణ్యత దిగుబడుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాస్త్రవేత్తలు అధికారులు విద్యార్థులు వివరించారు అన్నారు. ఈ కార్యక్రమంలోని అధికారులు ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, భగవాన్, నటరాజన్, ఆర్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News