ఏడుపాయలకు టెండర్ల ద్వారా రూ.2.56 కోట్ల ఆదాయం

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం

Update: 2024-12-18 15:40 GMT

దిశ, పాపన్నపేట : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ మాత దేవస్థానం వద్ద 2025 సంవత్సరానికి వివిధ వస్తువులు విక్రయించడానికి, వస్తువులను సేకరించడానికి బుధవారం టెండర్లు నిర్వహించగా రూ.2.56 కోట్ల ఆదాయం సమకూరింది. కొబ్బరికాయలు విక్రయించేందుకు టెండరు నిర్వహించగా మెదక్ పట్టణానికి చెందిన లింగోజీ రూ.1,11,20,000 వేలు అత్యధిక వేలం పాట పాడి టెండర్ దక్కించుకున్నారు. ఒడిబియ్యం సేకరణకు సంబంధించి నాగసాని పల్లి కి చెందిన జీవన్ రెడ్డి రూ.1,09,50,000 వేలు అత్యధిక వేలం పాట పాడి దక్కించుకున్నారు.

పూజా సామగ్రి అమ్మకానికి సంబంధించి నాగసాని పల్లి గ్రామానికి చెందిన బొందల నర్సింలు గౌడ్ రూ.17 లక్షల, తలనీలాలకు సంబంధించి మూడు నెలల కాలపరిమితితో ఖమ్మం కు చెందిన దుర్గారావు రూ.8.30 లక్షలకు అత్యధిక వేలం పాట పాడి దక్కించుకున్నారు. కాగా ఇదివరకే ఎగ్జిబిషన్ కు సంబంధించి రూ. 9.60 లక్షలకు ఆర్కే మేనేజ్మెంట్ హైదరాబాద్ వారు, చెప్పుల స్టాండ్ కు సంబంధించి రూ.ఒక లక్ష 15 వేలకు మెదక్ పట్టణానికి చెందిన అరవింద్ అత్యధిక వేలంపాట పడి దక్కించుకున్నారు. ఈ టెండర్ల ద్వారా ఏడుపాయల దేవస్థానానికి రెండు కోట్ల యాభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. టెండర్ నిర్వహణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఆలయ సిబ్బంది, టెండర్ దారులు పాల్గొన్నారు.


Similar News