వర్షం కోసం రైతన్న ఎదురు చూపులు.. ముదిరి పోతున్న వరి నారుమడి

వర్షాకాలం ప్రారంభమై రెండు కార్తెలు వెళ్లి పోయినప్పటికీ సరైన

Update: 2024-07-04 12:55 GMT

దిశ, చిన్నశంకరంపేట : వర్షాకాలం ప్రారంభమై రెండు కార్తేలు వెళ్లి పోయినప్పటికీ సరైన వర్షాలు పడకపోవడంతో వర్షం కోసం మళ్లీ ఎదురు చూసే రోజులు వచ్చాయి. వానాకాలం ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ఆకాశంలో మేఘాలు రోజు దట్టంగా కమ్ముకుంటున్న వర్షాలు జాడ మాత్రం లేదు. మృగశిర కార్తీ ముందు మూడు రోజుల పాటు మండలంలో చిరుజల్లులతో కురిసిన వర్షం ఆ తర్వాత మళ్లీ వర్షాలు పడలేదు. కానీ రెండు రోజులు వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు బోరు బావుల వద్ద నారుమడులు పోసుకున్నారు. కానీ చెరువు,కుంటల కింద దున్న కాలు దున్నారు. నారు పోసుకునేందుకు విత్తనాలు తెచ్చి పెట్టుకున్నారు. వర్షాలు పడకపోవడంతో ఇక్కడ రైతులు అయోమయంలో పడిపోతున్నారు.చిన్నశంకరంపేట మండలంలో 7వేల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న పత్తి, కందులు, పెసలు, పండిస్తారు.

ముదిరిపోతున్న నారుమళ్ళు..

చిన్న శంకరం పేట మండలం లో 14 వేలకు పైగా ఆయకట్టు సాగుకు అనువుగా రైతులు ఏర్పాటు చేసుకున్నారు.బోరు బావుల వద్ద ఇప్పటికే తుకాలు పోసుకొనగా,ఈ తుకాలు ముదిరిపోతున్న వర్షాలు పడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.ప్రతి రోజు వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షం పడితే విస్తారంగా వరి నాట్లు వేస్తారు. బోరు మోటార్లతో నీరు అందించడం గగనమైంది.రబీ పంటకు అందించిన నీరు ఖరీఫ్ పంటకు నీరు బోరు బావులు నండి ఆగి ఆగి పోస్తున్నాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జోరుగా వానలు పడకపోవడంతో నెలలోకి నీరు దిగడం లేదు. చిన్నశంకరంపేట, శాలిపేట,మడూర్, ఖాజాపూర్, మిర్జాపల్లి, శేరిపల్లి, మాందాపూర్, ఎస్, కొండాపూర్,తదితర గ్రామాలలో రోహిణి కార్తిలో నారుమళ్లు సాగు చేసిన నీరు లేక ఎండిపోతున్నాయి.మళ్ళీ నారుమళ్ళు పోసుకోవలిసి వస్తుందేమో అన్నా సందేహం రైతులలో నెలకొంది.

*దోబూచులాడుతున్న కాలం

ఈ ఏడాది ఖరీఫ్ లో రైతులు ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయా! లేదా? కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ కాలం ప్రారంభమై 40 రోజులు అవుతుంది. బయటికి నేటికీ భారీ వర్షం పడిన దాఖలు లేవు. సాగునీటి వనరులైన కుంటలు, చెరవుల్లో చుక్కనీరు చేర లేదు. బోరుబావుల్లో నీటిమట్టం కొంచమైనా నీరు రాలేదు.వరి నారుమళ్లు ముదిరిపోతున్నాయి.దీంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News