విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రేగోడ్ తహసీల్దార్ సస్పెన్షన్

విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న రేగోడ్ తహసీల్దార్ పై వేటుపడింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని కారణంగా రేగోడ్ తహసీల్దార్ బాల లక్ష్మీని కలెక్టర్ సస్పెండ్ చేశారు

Update: 2024-09-20 09:12 GMT

దిశ, రేగోడ్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న రేగోడ్ తహసీల్దార్ పై వేటుపడింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని కారణంగా రేగోడ్ తహసీల్దార్ బాల లక్ష్మీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. మెదక్ ఆర్డీవో రమాదేవి గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో తహసీల్దార్ అందుబాటులో లేరు. ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీవో అదే సమయంలో కార్యాలయానికి వచ్చిన రైతులు, లబ్ధిదారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ కు తగు వివరాలతో నివేదిక సమర్పించడం జరిగింది. ఈ మేరకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఇక్కడి తహసీల్దార్ బాల లక్ష్మి ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తహసీల్దార్ సస్పెన్షన్ విషయం మండలం లో చర్చనీయాంశం కాగా విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాత తహసీల్దార్ సస్పెన్షన్ కు గురైన వెంటనే నూతన తహసీల్దార్ ను నియమిస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మెదక్ లో పని చేస్తున్న నరేష్ ను రేగోడ్ తహసీల్దార్ గా నియమించగా ఆయన శుక్రవారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.


Similar News