బెజ్జంకి లో విషాదం..కూతురితో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2024-09-20 09:28 GMT

దిశ, బెజ్జంకి : కుటుంబ కలహాలతో కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో దూకిన సంబరి. శారద (33) మృతదేహాన్ని బయటకు తీశారు . కూతురు స్పందన (14) మృతదేహం ఇంకా ఆచూకీ దొరకలేదు. ఎస్సై జె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిస్క్ టీం, గజ ఈతగాళ్లతో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News