రాజకీయ లబ్దికోసం.. బీఆర్ఎస్, బీజేపీ సీక్రెట్ ఎజెండా : ఎమ్మెల్యే కూనంనేని

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-22 09:39 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపి సీక్రెట్ ఎజెండాతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రేకెత్తించే విధంగా కొన్ని పార్టీలు చర్యలు చేపడుతున్నాయని అన్నారు. బీజేపీ హిందూ ముస్లిం గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. లగచర్ల పార్మాసిటిని ఫోర్త్ సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రైతుల భూముల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడాన్ని సీపీఐ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. గిరిజనుల భూములు వారికే ప్రభుత్వం అప్పగించాలని సూచించారు. పార్మాసిటీ జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాలన్నారు.

బీఆర్ఎస్ నాయకులు ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులకు అన్యాయం చేసి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను రిపీట్ చేయవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయించి కాంగ్రెస్ కి అప్పగించినట్లు వెల్లడించారు. రెండు లక్షల పైన అన్న రైతు రుణ మాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. పోర్తు క్లాస్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎం చేశారు..? ఏమి చేస్తారో ఆంశాల పై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. వందేళ్ల సజీవంగా ఉన్న పార్టీ సీపీఐ పార్టీ అన్నారు. సీపీఐ అధికారానికి దూరంగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కార్పొరేట్ శక్తులకు ప్రధాని ఊడిగం..

కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోడీ ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచి పెడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని మోడీకి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇవ్వని కారణంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వామపక్ష శక్తులు ఒకే వేదిక మీదకు రావాలని పిలుపునిచ్చారు. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ నినాదం ముందుకు సాగుదాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి హామీలు అమలు చేశాకే ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.


Similar News