అందోలు – జోగిపేట మున్సిపాలిటీ భవనానికి మోక్షం...

అందోలు – జోగిపేట మున్సిపాలిటీకి నూతన భవనానికి మోక్షం లభించింది.

Update: 2024-11-22 13:22 GMT

దిశ, అందోల్‌ : అందోలు – జోగిపేట మున్సిపాలిటీకి నూతన భవనానికి మోక్షం లభించింది. పట్టణంలోని తహశీల్దార్‌ నివాసం భవనం స్థలంలో మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించేందుకు గుర్తించారు. ఈ స్థలంలో ఇటీవల మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. మున్సిపాలిటీ భవన నిర్మాణ పనుల్లో భాగంగా శుక్రవారం జేసీబీ సహయంతో శిథిలావస్థకు చేరిన తహశీల్దార్‌ నివాస భవనాన్ని కూల్చివేత పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీగా ఏర్పాటైన కొత్తలో పాత నగర పంచాయతీ కార్యాలయంలో కొన్నాళ్ల పాటు కొనసాగించి, మున్సిపాలిటీకి కొత్త భవనం కోసం అప్పట్లో నిధులను కేటాయించారు.

అయితే పాత నగర పంచాయతీ భవనాన్ని కూల్చి వేసి, అదే స్థలంలో మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించేందుకు గాను పుట్టింగ్‌ల వరకు చేపట్టి మధ్యలో వదిలేశారు. అప్పటి నుంచి మున్సిపాలిటీ కార్యాకలాపాలను పశుసంవర్ధక శాఖకు చెందిన రైతుల సమావేశ మందిరంలో కొనసాగిస్తున్నారు. ఇటీవల మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ ప్రత్యేక చోరవతో అధునిక హంగులతో నూతన మున్సిపాలిటీ భవనం నిర్మాణం కోసం రూ.6 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో అన్ని మౌళిక సదుపాయాలతో కూడిన భవనాన్ని నిర్మించేందుకు డిజైన్‌ చేశారు. నూతన మున్సిపాలిటీ భవన పనుల ప్రారంభించడం పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన తహశీల్దార్‌ నివాస భవనాన్ని కూల్చివేసి పనులను ఏఈ శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్‌ డి.శంకర్, నాయకులు పిట్ల లక్ష్మణ్, వెంకటేశం, మోసీన్, డి.చిన్నా, వర్క్‌ ఇన్‌స్పేSక్టర్‌ మహేందర్‌లతో పాటు తదితరులు ఉన్నారు.


Similar News