ప్రజాపాలన కళా యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19 నుంచి వచ్చే డిసెంబర్ 7 వరకు నిర్వహిస్తున్న కళాయాత్రకు విశేష స్పందన లభిస్తుంది.

Update: 2024-11-22 10:46 GMT

దిశ, సిద్దిపేట అర్బన్ : ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19 నుంచి వచ్చే డిసెంబర్ 7 వరకు నిర్వహిస్తున్న కళాయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ప్రజలు కార్యక్రమం ముగిసే వరకు ఉండి ఆసక్తిగా వినటం గమనార్హం. తెలంగాణ సాంస్కృతిక సారథి సిద్దిపేటకు చెందినటువంటి కళాంజలి రాజేష్ బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ సంబరాలలో కళాకారులు పుల్లూరు గ్రామంలో పాటల ద్వారా, మాటల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు.

అదేవిధంగా ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 కి వంటగ్యాస్, రైతు రుణమాఫీ వంటి పథకాలను, అలాగే సంవత్సర కాలంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు. ప్రతిరోజు మూడు గ్రామాల చొప్పున 20 రోజుల పాటు ఈ కళాయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా కళాకారులు పుల్లూరు యాదగిరి, మయూరి భాస్కర్, ముదిగొండ నర్సింహులు, వివి కన్న, బండ మంజల సడిమెల రాజమణి, మోతే బాబు, ఎల్లగారి శేఖర్, ఎర్పుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News