భారీ వర్షానికి సంగారెడ్డి అతలాకుతలం..జలదిగ్బంధంలోనే..

సంగారెడ్డిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు

Update: 2024-09-07 12:21 GMT

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణం అతలాకుతలం అయింది. సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ కింద గల సర్వే ల్యాండ్ కాలనీ, ఎర్రకుంటలో నిర్మించిన పలు కాలనీలు నీట మునిగాయి. చెరువులను ఆక్రమించి ఇండ్లు నిర్మించడం వల్లే పూర్తిగా ఇండ్లు నీటి మునిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జల వనరులను కాపాడేందుకు నిర్మించిన చెరువులు, కుంటలను కొందరి ధనదాహానికి పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట డ్రైవర్స్ కాలనీ పక్కన ఉన్న ఎర్రకుంట చెరువులో ఉన్న ఇండ్లు నీటి మునిగాయి. చెరువు ఎఫ్ టీఏల్ బఫర్ జోన్ లలో నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్న కొంతమంది రియల్ వ్యాపారులు తమ స్వార్థ బుద్ధితో చెరువులో ప్లాట్ లు చేసి అమాయకులకు విక్రాయించి సొమ్ము చేసుకుంటున్నారు.


దానికి తోడు ముడుపులకు రాజకీయ ఒత్తిళ్లకు అలావాటు పడిన కొంతమంది మున్సిపల్, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తోడు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చెరువులో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న పట్టించుకునే వారే లేకపోవడంతో కురిసిన వర్షానికి ఇండ్లు నీట మునిగాయి. ఎర్రకుంట చెరువు సర్వేనెంబర్ 376 లో 11.32, పదకొండు ఎకరాల ముప్పై రెండు గుంటల విస్తీరణం కాగా దాని ఎఫ్ టీఏల్ పరిధిలోకి సర్వే నెంబర్ లు 375,378,374 వస్తాయి. కాగా వాటిలో కొంతమంది గత కొన్ని సంత్సరాలుగా పదుల సంఖ్యలో ఎర్రకుంట ఎఫ్ టీఎల్ లో ఇండ్ల నిర్మాణం జరుగుతున్న పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా ఎర్రకుంట చెర్వు కట్టని, తూముని ద్వంసం చేసి మరి కొంతమంది భూ కబ్జా దారులు ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు. ఇక నైనా ఉన్నత అధికారులు ఎర్రకుంట చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఆక్రమణ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకొని ఎర్రకుంట ఆక్రమణ కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణ వల్లే ఇండ్లు నీటి మునిగాయని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని నీటి వనరులను కాపాడాలని కోరుతున్నారు.






Similar News