రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మండల కేంద్రంలోని ఐబీ కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
దిశ, తాండూర్: మండల కేంద్రంలోని ఐబీ కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నీతి నిజాయితీ గల ప్రజా నాయకుడైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను విమర్శించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏమాజి, తిరుపతి, మహిధర్ గౌడ్, శ్రీకృష్ణదేవరాయలు, గోవర్ధన్, సుధీర్ గౌడ్, విజయకుమార్, శేషగిరి, ఏమాజీ, భరత్, పట్టేం విష్ణు కళ్యాణ్, ప్రదీప్, విగ్నేష్, బాలకృష్ణ, అరుణ్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.