రోగులకు మెరుగైన వైద్యం అందించండి: కలెక్టర్ రాజర్షి షా

రోగులకు మెరుగైన వైద్యం అందించి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.

Update: 2023-02-23 13:53 GMT

దిశ, తూప్రాన్: రోగులకు మెరుగైన వైద్యం అందించి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టర్ గురువారం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల రోగస్థులకు వైద్యం అందించడం కారణంగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. కావున ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీవో శ్యాం ప్రకాష్, డాక్టర్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్ పై ప్రత్యేక సమావేశం..

తూప్రాన్ మున్సిపల్ లో 2023-24 బడ్జెట్ అంచనా సమావేశాలు చైర్మన్ రవీందర్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ పాల్గొన్నారు. మున్సిపల్ అకౌంటెంట్ వెంకట్రావు బడ్జెట్ అంచనా చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోహన్, మున్సిపల్ ఏఈ సాయి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News