దేశంలో దుర్మార్గ పాలన చేస్తున్న ప్రధాని మోదీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ దుర్మార్గ పాలన చేస్తున్నాడని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.
దిశ, సంగారెడ్డి: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ దుర్మార్గ పాలన చేస్తున్నాడని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్ర పోరాటం కోసం మహత్మా గాంధీ దిండీ ఉద్యమం చేస్తే నాటి బ్రీటీష్ పాలకులు కేసులు పెట్టి జైల్లో వేశారని గుర్తు చేశారు.
నేడు దేశంలో జరుగుతున్న అరాచకాలను విమర్శించినందుకు కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. ప్రధాని మోదీ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని, దానిని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన చేసిందని విమర్శిస్తున్నారని ప్రధాని అవకాశం వచ్చిన సోనియాగాంధీ పదవి వద్దని మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిందని గుర్తు చేశారు. అంతకు ముందు పీవీ నర్సింహ రావును ప్రధాని చేశారని తెలిపారు.
మరి దేశంలో కాంగ్రెస్ ఎక్కడ కుటుంబపాలన చేసిందని ఆరోపించారు. బీజేపీ అవినీతిపై ప్రశ్నిస్తే చేస్తే కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోదీలను విమర్శించారనే నెపంతో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారని, కోర్టు నెల రోజుల వ్యవధి ఇచ్చినా ఎంపీ పదవి నుంచి ఎలా తొలగిస్తారని, పదవి తొలగించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహించడంతోనే బీజేపీకి వణుకు పుట్టిందని, పార్లమెంట్ లో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని పట్టుబడితే బయపడని ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించారని ఆరోపించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ నిర్మలా జగ్గారెడ్డి, నాయకులు మునిపల్లి సత్యనారాయణ, జార్జీ, కూన సంతోష్, తదితరులు పాల్గొన్నారు.