అధికారుల అవినీతి వల్లే నాసిరకం నిర్మాణం

మెదక్ పట్టణం దాయార రోడ్డు నిర్మాణం పై దిశ పత్రికలో వచ్చిన ‘నవ్వేలా నాణ్యత’ శీర్షికతో వచ్చిన కథనం పై పలువురు ప్రశంసించారు.

Update: 2024-07-07 11:56 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ పట్టణం దాయార రోడ్డు నిర్మాణం పై దిశ పత్రికలో వచ్చిన ‘నవ్వేలా నాణ్యత’ శీర్షికతో వచ్చిన కథనం పై పలువురు ప్రశంసించారు. దిశ పత్రికలో మెదక్ పట్టణంలోని దాయార రాందాస్ చౌరస్తా రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న నాణ్యత లేకపోవడంపై దిశలో కథనం ఆదివారం ప్రచురితమైన విషయం తెలిసిందే. దాయార కాలనీ వాసులతో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 7.8 కోట్ల నిధులతో చేపడుతున్న పనులు పూర్తిగా నాసిరకంగా ఉన్నట్టు తాము సంబధిత శాఖ ఏఈ తో పాటు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి దురుసుగా సమాధానం ఇవ్వడం పై అవేదన వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు

    కూడా నాసిరకంగా సాగుతున్న నిర్మాణం వల్ల భవిష్యత్తు లో రోడ్డు చెడిపోతుందని, నాలుగు కాలాల పాటు ఉండదని చెబితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. అర్ అండ్ బీ శాఖ లో ఉన్న అధికారికి ఫోన్ చేస్తే పని ఇలాగే ఉంటుందని, ఇంతకంటే ఇంకా బాగా ఎవరు చేస్తారని సమాధానం ఇవ్వడం తో మౌనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో పాత రాళ్లు, డస్ట్ పౌడర్ కలిపి నిర్మిస్తున్నా కనీసం క్యూరింగ్ చేయడం లేదని పలువురు వాపోయారు. కాంట్రాక్టర్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లనే నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కోట్ల తో చేపట్టిన పనుల్లో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ స్వలాభం కోసమే అన్నట్టుగా సాగుతున్న వ్యవహారం పై స్థానికుల్లో విమర్శలు వస్తున్నాయి.

గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..

రాందాస్ చౌరస్తా, దాయార రోడ్డు నిర్మాణం నాసిరకంగా చేస్తుండడం పై సోమవారం జరిగే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయనున్నట్టు దాయార కు చెందిన యువకులు తెలిపారు. కాంట్రాక్టర్ కు రాజకీయ నేతల అండతో పాటు అధికారుల వత్తాసు ఉండడం వల్లనే పనులు నాసిరకంగా సాగుతున్నాయని, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా స్పందన రాకుంటే రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నాసిరకం పనులపై దిశ పత్రికలో వచ్చిన కథనం మంత్రి దృష్టికి సైతం తీసుకు వెళ్లినట్టు పట్టణ వాసులు తెలిపారు. 


Similar News