అమాయకులపై పోలీసుల జులుం.. భూ వివాదంలో దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్

అమాయకులపై పోలీస్ కానిస్టేబుల్ దుర్భాషలాడుతూ జులుం

Update: 2024-07-04 11:52 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అమాయకులపై పోలీస్ కానిస్టేబుల్ దుర్భాషలాడుతూ జులుం చూపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దూరు మండలం నరసయ్య పల్లి గ్రామంలో చోటు చేసుకోగ పోలీస్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...పది రోజుల క్రితం వ్యవసాయ భూమి గెట్టు వివాదం విషయంలో చింతల చందుపై అన్నెపు బాలయ్య చేర్యాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు చింతల చందును పోలీసు స్టేషన్ రావాలని ఫోన్ చేసి సూచించారు. చందు భూమి పొజిషన్ కు వచ్చి విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం చేర్యాల పోలీసు స్టేషన్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సదరు వ్యవసాయ స్థలం వద్దకు వెళ్లారు.

చింతల చందు, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ కు పిలిస్తే రావారా..? నీ అంతు చూస్తా, నువ్వు ఎలా బ్రతుకు తావో చూస్తా అంటూ బూతు పదజాలంతో తిడుతూ చెంపలపై కొట్టినట్లు చింతల చందు ఆరోపిస్తూ చేర్యాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చేర్యాల ఎస్ ఐ దామోదర్ ను వివరణ కోరగా...వ్యవసాయ భూమి వద్దకు పోలీసు కానిస్టేబుల్ వెళ్లిన సమయంలో వీడియో ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా చందు దురుసుగా ప్రవర్తించగా...కానిస్టేబుల్ కు చందుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చందును కానిస్టేబుల్ కొట్టలేదని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని ఎస్ఐ స్పష్టం చేశారు.


Similar News