గణేష్ మండపాలకు పర్మిషన్ తప్పనిసరి.. పోలీస్ కమిషనర్

గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలని పోలీస్ కమిషనర్ డా. అనురాధ సూచించారు.

Update: 2024-09-03 13:31 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలని పోలీస్ కమిషనర్ డా. అనురాధ సూచించారు. గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్‌సైట్ పూర్తి వివరాలను నమోదు చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్‌లను వినియోగించాలన్నారు. గణేష్ దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవడం వల్ల పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారన్నారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గాని లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8712667100, సిద్దిపేట ఏసీపీ/8712667310, గజ్వేల్ ఏసీపీ 8712667330, హుస్నాబాద్ ఏసీపీ 8712667350, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు.


Similar News