అస్వస్థతకు గురైన విద్యార్థినీలను పరామర్శించిన మంత్రి..

వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న కే జీ వీ బీ విద్యార్థినీలకు మెరుగైన సేవలతో పాటు చికిత్సలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రవి కి సూచించారు.

Update: 2024-10-27 15:03 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న కే జీ వీ బీ విద్యార్థినీలకు మెరుగైన సేవలతో పాటు చికిత్సలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రవి కి సూచించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని కే జీ వీ బీ విద్యార్థులు ఇటీవల వైరల్ ఇన్ఫెక్షన్ తో 10 మంది సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha), ఆసుపత్రిలో చేరిన విద్యార్థులందరి వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు. విద్యార్థులు త్వరగా కోలుకుంటారని వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. విద్యార్థులకు అందిస్తున్న సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు విద్యార్ధులకు మంచి చికిత్సలు అందిస్తున్నారని, రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి వివరించారు. ఎలాంటి భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, వైద్యులు మెరుగైన చికిత్సలు అందిస్తున్నారని రేపో, మాపో విద్యార్థులందరూ డిశ్చార్జ్ అయి వారి వారి ఇంటికి చేరుకుంటారని చెప్పారు.

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్...

సంగారెడ్డి ప్రభుత్వ అస్పత్రిలో చికిత్సలు పొందుతున్న కే జీ వీ బీ విద్యార్థులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(MLA Chinta Prabhakar), డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు పరామర్శించారు. విద్యార్ధులు అందరూ త్వరగా కోలుకుంటారని, ఎవరు అధైర్య పడొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. డాక్టర్లు కూడా మెరుగైన చికిత్సలు అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు వివారించారు. ఏం భయపడాల్సిన అవసరం లేదని, అన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీ డీ సీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, నరసింహ గౌడ్, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్ధులకు డాక్టర్లు మంచి చికిత్సలు అందిస్తున్నారు : కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న కే జీ వీ బీ విద్యార్ధులకు డాక్టర్లు మంచి చికిత్సలు అందిస్తున్నారని కలెక్టర్ క్రాంతి వల్లూరు(Collector Kranti Vallur), విధ్యార్ధుల తల్లిదండ్రులకు వివరించారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు త్వరగా కోలుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.


Similar News