Rajireddy : బీఆర్ఎస్ కు రాజిరెడ్డి రాజీనామా.. కాంగ్రెస్ వైపు చూపు

వెల్దుర్తి మండల బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వియ్యంకుడు సిద్ది రెడ్డిగారి రాజిరెడ్డి ( Rajireddy ) బీఆర్ఎస్ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు.

Update: 2024-10-28 07:33 GMT

దిశ, వెల్దుర్తి : వెల్దుర్తి మండల బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వియ్యంకుడు సిద్ది రెడ్డిగారి రాజిరెడ్డి ( Rajireddy ) బీఆర్ఎస్ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రెండు దశాబ్దాల కాలం పాటు మండలస్థాయి నాయకుడిగా పనిచేసిన రాజిరెడ్డి దామరంచ గ్రామ ( Damarancha village ) సొసైటీ చైర్మన్ గా పనిచేశారు.

మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి ( MLA Sunitha Reddy ) విధేయుడుగా పేరున్న రాజిరెడ్డి ఎమ్మెల్యేతో విభేదాల కారణంగానే పార్టీని వీడినట్లు సమాచారం. ఎమ్మెల్యే బుజ్జగించినా రాజిరెడ్డి వినకుండా తన రాజీనామా పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. మారిన రాజకీయ సమీకరణ వల్ల 2018లో తన సమీప బంధువు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ప్రోద్బలంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆరు సంవత్సరాలు రాజిరెడ్డి బీఆర్ఎస్ లో పనిచేశారు.

Tags:    

Similar News