Additional Collector :మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ బదిలీ

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. నూతన అదనపు కలెక్టర్ గా నగేష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-28 10:07 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. నూతన అదనపు కలెక్టర్ గా నగేష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ను వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ చేయగా అదే స్థానంలో అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నగేష్ ను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ కు నియమించింది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రభుత్వం బదిలీలు చేపట్టడంతో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ బదిలీ అయ్యారు. బదిలీ పై వస్తున్న నగేష్ గతంలో మెదక్ జిల్లా ఆర్డీవో గా విధులు నిర్వహించారు. జిల్లాల పునర్విభజన లో కొత్త జిల్లాలో ఇంచార్జి డి ఆర్ వో గా సైతం బాధ్యతలు నిర్వహించారు. స్థానికంగా గుర్తింపు ఉన్న నగేష్ కు రెవెన్యూ విభాగంలో అదనపు కలెక్టర్ గా బదిలీ పై వస్తున్నారు.


Similar News