క్రీడాప్రాంగణం ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం..

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లోని యువత, విద్యార్థులు క్రీడానైపుణ్యం పెంపోందించుకోవాలని, క్రీడలవలన శరీరం దృఢత్వమవుతుందని, ఆరోగ్యంగావుంటారని భావించి గ్రామాలలో క్రీడాప్రాంగనాల ఏర్పాటుకు ఆదేశాలు జారిచేసింది.

Update: 2023-04-13 11:27 GMT

దిశ, మద్దూరు : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లోని యువత, విద్యార్థులు క్రీడానైపుణ్యం పెంపోందించుకోవాలని, క్రీడలవలన శరీరం దృఢత్వమవుతుందని, ఆరోగ్యంగావుంటారని భావించి గ్రామాలలో క్రీడాప్రాంగనాల ఏర్పాటుకు ఆదేశాలు జారిచేసింది. మద్దూరు మండలం వంగపల్లి గ్రామంలో మాత్రం పేరుకుమాత్రమే క్రీడాప్రాంగణం బోర్డు ఏర్పాటుచేసి గ్రామపంచాయతీ అధికారులు చేతులుదులుపుకున్నారు.

క్రీడాప్రాంగణంలో క్రీడాపరికరాలు ఏర్పాటుచేయకుండా గ్రామపంచాయతీ ఆఫీస్ లో మూలనపడవేశారు. మండలస్తాయి అధికారుల పట్టించుకోకపోవడం వలెనే గ్రామస్తాయి అధికారులు సరిగపనిచేయడం లేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. క్రీడాప్రాంగణం ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని గ్రాస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News