ప్రజలకు ప్రభుత్వానికి వారధి దిశ దినపత్రిక : ఎమ్మెల్యే
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనతి కాలములోనే దిశ పత్రిక రెండు రాష్ట్రాల్లో ముందుకు దూసుకుపోతుందని మానకొండూర్ ఎమ్మెల్యే
దిశ,బెజ్జంకి: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనతి కాలములోనే దిశ పత్రిక రెండు రాష్ట్రాల్లో ముందుకు దూసుకుపోతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దిశ దినపత్రిక సేవలను కొనియాడారు. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల విలేకరి ఆవుల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో దిశ యజమాన్యం ముద్రించిన 20 25 నూతన సంవత్సర క్యాలెండర్ బెజ్జంకి మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించి మాట్లాడారు. దిశ దినపత్రిక స్థాపించి అతి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యలను క్షణాల్లో వెలికి తీసి క్షణాల్లో వార్త ప్రచురణ చేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందని అన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణలో దిశ దినపత్రిక సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలములోని తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.