పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతమడక గ్రామ
దిశ, సిద్దిపేట అర్బన్: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతమడక గ్రామ శివారులో కాశి రెడ్డి వెంకట్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్ షెడ్ లో కొంతమంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారు. ఈ సమాచారం మేరకు తేదీ 04 శనివారం రాత్రి సమయంలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిద్దిపేట రూరల్ పోలీసులు రైడ్ నిర్వహించారు. 06 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.10,060 లను, 06 మొబైల్ ఫోన్లు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.