33 జిల్లాల్లో 66 కోట్లతో మాడ్రన్ దోబీ ఘాట్ లను నిర్మిస్తాం: మంత్రి హరీష్

దిశ,మెదక్: చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా

Update: 2022-03-13 11:51 GMT

దిశ,మెదక్: చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని రాష్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహన్ని,శివాలయం వద్ద సంత్ బాబాల విగ్రహాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ తో కలసి ప్రారంభించారు. 4 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో నిర్మాణం కానున్న మాడ్రన్ దొబిగాట్ కు శంకుస్థాపన చేశారు. 44 లక్షలతో కొనుగోలు చేసిన స్వ్విపింగ్ యంత్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో రజకుల ఆత్మగౌరవ సభ జిల్లా అధ్యక్షులు సంగు స్వామి అధ్యక్షతన  జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 66 కోట్లతో మాడ్రన్ దోబీ ఘాట్ లను నిర్మిస్తామని చెప్పారు. మెదక్ లో రజక సంఘం భవన నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయిస్తామని,  రజకుల ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 50 లక్షలు ఇప్పుడే ఇస్తున్నట్లు ప్రకటించారు. రజకులకు రుణాలను అందించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రజకులకు బీమా సొకర్యం కల్పిస్తామన్నారు. రజకులకు,  నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు 60 ఏండ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. రజకులను ఎస్,సి,జాబితాలో చేర్చే అంశాన్ని సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని రజక సంఘం నాయకులకు హామీ ఇచ్చారు.

మెదక్ కు మెడికల్, నర్సింగ్ కాలేజ్ మంజూరు

మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కాలేజ్ ను మంజూరు చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. 550 బెడ్లతో జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు జిల్లాకు నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సభలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 3 లక్షలతో ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తానన్నారు. సీఎం కేసీఆర్ 91 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సభలో ఇఫ్కొ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ చైర్మన్లు చంద్ర పాల్ ,జితేందర్ గౌడ్, మురళి యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, బట్టి జగపతి ,సరాఫ్ యాదగిరి, మల్లికార్జున్ గౌడ్ కృష్ణారెడ్డి రజక సంఘం రాష్ట్ర నాయకులు, ఉప్పలయ్య, మల్లేష్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మధ్యలో ఆగిన పౌర సన్మానం

జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు మంత్రి హరీష్ రావు కు పౌర సన్మానం చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా ముందుగా మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు శాలువాతో మంత్రి హరీష్ రావును సన్మానిచారు. ఈ సమయంలో మహిళలు, రజక సంఘం నాయకులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సన్మాన కార్యక్రమం ముగిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించి ...అందరినీ మైక్ లో కూర్చోవాలని వేడుకున్నారు...దీంతో రజక సంఘం నేతలు మైక్ తీసుకొని వారి సమస్యలను మంత్రికి విన్నవించారు. దీంతో రజకులు శాంతించారు.

Tags:    

Similar News