డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం.. అలా చేస్తే మళ్లీ తీసుకుంటాం : Minister Harish Rao

లబ్ధిదారులు ఇళ్ళు కిరాయికి.. ఇవ్వోద్దు.. అమ్మోద్దని, అలా చేస్తే ఇండ్లు వాపస్ తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

Update: 2022-11-28 10:22 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: లబ్ధిదారులు ఇళ్ళు కిరాయికి.. ఇవ్వోద్దు.. అమ్మోద్దని, అలా చేస్తే ఇండ్లు వాపస్ తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చులేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్న ట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో సోమవారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని కేసీఆర్ నగర్‌‌లో 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం, పోచమ్మ దేవాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణ, మంచినీటి ట్యాంక్ పనులకు శంకుస్థాపన, పోలీసు ఔట్ పోస్ట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రెడ్డి సంక్షేమ భవనం లో 300 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే పేద ప్రజల కోసం 2,460 గృహా సముదాయం సిద్ధిపేట లోనే ఉన్నదని, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆదర్శవంతమైన కాలనీగా కేసీఆర్ నగర్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పోలీసు ఔట్ పోస్ట్‌తో ప్రజలకు మంరిత భద్రత ఉంటుందన్నారు. 


పట్టాలు అందజేసిన వారితో త్వరలో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టి మరికొంత మంది పేదలకు అందజేస్తామన్నారు. గతంలో లబ్ధి పొందని పేద అక్రిడిటేషన్ కార్డు కలిగిన 72 మంది జర్నలిస్టులకు మూడు బ్లాక్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అర్హులైన దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అందజేస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి అడుగు జాగలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం సుడా కార్యాలయ ఆవరణలో రూ.39 లక్షలతో నిర్మించిన 4 కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణ సముదాయాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

గ్రూప్-4 లో 10 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..

నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా 10 వేల ఉద్యోగాల భర్తీకి గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఎల్అండ్‌టీ శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగం సైతం ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పోలీసు కమిషనర్ శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ మరుపల్లి. శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి. కనకరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత, వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు ధర్మవరం బ్రహ్మం, సద్ది నాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News