పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తా.. మున్సిపల్ కమిషనర్
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేసేందుకు వెనకాడని మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ హెచ్చరించారు.
దిశ, మెదక్ ప్రతినిధి: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేసేందుకు వెనకాడని మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ హెచ్చరించారు. మెదక్ పట్టణంలోని 17వ వార్డు దయార, సుభాష్ కాలనీలో కౌన్సిలర్ రాజలింగం తో కలిసి శానిటేషన్ పనులను గురువారం పర్యవేక్షించారు. వార్డులో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డ్రైనేజీలలో పేరుకపోయిన సిల్ట్‌ను అడుగు భాగం నుండి తియ్యాలని తీసిన పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. డ్రైనేజీకి, సీసీ రోడ్డుకు ఇరువైపులా పెరిగినటువంటి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అక్కడక్కడ వాటర్ లీకేజ్ అవ్వడం చూసి జవాన్ కిషన్, వాటర్ లైన్మెన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సానిటరీ ఇన్స్ స్పెక్టర్ కూడా మెమో ఇస్తానని హెచ్చరించడం జరిగింది.
శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే పారిశుధ్య కార్మికుల నుంచి జవాన్ వరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనన్నారు. జవాన్లు ఫీల్డ్ మీద ఉంటూ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్‌ని కూడా సందర్శించి అక్కడున్న సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరు అయ్యేలా చూడాలని చెప్పడం చెప్పారు. డీఆర్‌సీసీ సెంటర్ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పొడి చెత్తను రీసైక్లింగ్ ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కంపోస్ట్ యార్డ్‌లో తయారైన వర్మి కంపోస్ట్‌ను పరిశీలించి, తడిచేత్త పొడి చెత్త కు సంబంధించినటువంటి రికార్డులను తనిఖీ చేశారు. డంపింగ్ యార్డ్‌లో చెత్తను రోడ్డుపై పోయకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.