సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

Update: 2022-01-18 16:37 GMT

దిశ,మెదక్: మెదక్ జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు ఘనపూర్ ప్రాజెక్టు ఆధునీకరణకు 50.32కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.ఇప్పటికే ప్రాజెక్టు కుడి, ఎడమ, ప్రాజెక్టు కాలువలకు సిమెంట్ లైన్ పనులు జరిగాయనీ ఆమె తెలిపారు. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు, ఆధునీకరణ పనులు జరగనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News