కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శప్రాయం
ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతోపాటు తన జీవితాన్ని రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు.
దిశ,పటాన్ చెరు : ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతోపాటు తన జీవితాన్ని రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. పటాన్ చెరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను తెలియజేయాలన్న లక్ష్యంతో పటాన్ చెరు బస్టాండ్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతి త్వరలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, శీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, వేముల రమేష్, రఘు రాముల, సునీల్, జగదీష్, శ్రీ రామ్, అశోక్, కృష్ణ, లక్ష్మణ్, కృష్ణ, సదానంద, ప్రసాద్, రాజు స్టీల్, సతీష్, నామ రాజు పాల్గొన్నారు.