భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

Update: 2024-09-15 15:58 GMT

దిశ, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఆలయానికి చేరుకున్న భక్తులు, ఆదివారం వేకువజామున లేచి కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తి శ్రద్దలతో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అందులో భాగంగా పట్నాలు, అభిషేకం, అర్చన, నిత్యకళ్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశ కండన, గంగిరేగు చెట్టుకు ముడుపులు వంటి తదితర మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం కొండపై వున్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించి దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.

మల్లికార్జున స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ..

గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతియేటా మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు.


Similar News