మాజీ సీఎం బంధువు పేరుతో బెదిరింపులు... హాల్దివాగు నుంచి నీటి తరలింపు

మాజీ సీఎం కేసీఆర్ బంధువు పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతూ హల్దీ వాగు నుంచి 40 హెచ్ పి మోటర్లతో నీటి దోపిడీకి ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ జయచంద్ర రెడ్డికి,

Update: 2024-10-26 12:24 GMT

దిశ, తూప్రాన్ : మాజీ సీఎం కేసీఆర్ బంధువు పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతూ హల్దీ వాగు నుంచి 40 హెచ్ పి మోటర్లతో నీటి దోపిడీకి ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ జయచంద్ర రెడ్డికి, ఇరిగేషన్ అధికారులకు తూప్రాన్, కిష్టాపూర్ రైతులు ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని హల్డివాగు నుంచి మల్లరెడ్డి అనే వ్యక్తి భారీ స్థాయిలో అక్రమంగా నీటిని తరలింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అక్రమంగా నీటిని తరలిస్తే గద్దర్ లిఫ్ట్ కాలువ పరిధిలో ఉన్న తూప్రాన్,కిష్టాపూర్ కి చెందిన వందల కుటుంబాలు రోడ్డున పడతాయని అధికారుల ముందు వాపోయారు. అక్రమ నీటి తరలింపు పై రైతులు ప్రశ్నిస్తే ఈ స్థలం మాజీ సీఎం కేసీఆర్ వాళ్ల బంధువు కన్నారావు ది అని ఆయనకు అడ్డు వస్తే మీకే ప్రమాదం అని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాల పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అధికారులను కోరారు.


Similar News