కేసీఆర్ భావోద్వేగం
కొన్ని నెలలుగా కుటుంబానికి దూరమై ఎమ్మెల్సీ కవిత బీహార్ జైల్ నుండి తిరిగి రావడంతో గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు.
దిశ, ములుగు : కొన్ని నెలలుగా కుటుంబానికి దూరమై ఎమ్మెల్సీ కవిత బీహార్ జైల్ నుండి తిరిగి రావడంతో గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. తన బిడ్డ కవితను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పాదాలకు కవిత నమస్కరించారు.
బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ఆశీర్వదించారు. ఎర్రవెల్లి నివాసానికి కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఇవాళ మధ్యాహ్నం వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూడగానే కేసీఆర్ ముఖంలో ఆనందం కనిపించింది. చాలాకాలం తర్వాత ఉత్సాహంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయకులు, సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. కవిత రాకతో కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది.