ఇక్రిసాట్ లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్

ఇక్రిసాట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

Update: 2023-05-04 11:28 GMT

దిశ, పటాన్ చెరు : ఇక్రిసాట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇక్రిశాట్ లో కాంట్రాక్టు కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాట శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్రిసాట్ యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకుని వెళ్లగా సానుకూలంగా స్పందించిన యాజమాన్యం త్వరలో కార్మికుల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలోని కార్మికుల హక్కుల కోసం ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతి కార్మికుడికి అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, నవీన్ గౌడ్, మిరాజ్, పాషా, శంకర్, నవీన్, హమీద్, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News