పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2023-03-01 12:17 GMT

దిశ, నర్సాపూర్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజల పై ఎంతో ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

    మోడీ ప్రభుత్వం ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజలకు నడ్డి విరిగే విధంగా ధరలను పెంచడం సమంజసం కాదని అన్నారు. నిరసన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, పాక్స్ చెర్మెన్ లు, ఎంపీటీసీ లు, సర్పంచు లు, మహిళా సంఘాలు, రైతు సంఘాల నాయకులు, ఆత్మ కమిటీ చెర్మెన్ లు, డైరెక్టర్ లు, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మెన్ గొర్రె వెంకట్ రెడ్డి, పాక్స్ చైర్మెన్ వెంకట్ రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News