'మంత్రి కొండా సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు'

రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హరీష్ రావు,కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మండిపడ్డారు.

Update: 2024-09-30 14:19 GMT

దిశ, దుబ్బాక : రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హరీష్ రావు,కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం దుబ్బాక పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద మాజీ మంత్రులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిత్రపటాల ప్లేక్సిలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల దుబ్బాక పట్టణంలో జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మొదటిసారిగా దుబ్బాకకు విచ్చేశారు.

కాగా మంత్రికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దుబ్బాక చేనేతలు తయారు చేసిన నూలు పోగుల దండతో సత్కరించి దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రిని కోరగా సోషల్ మీడియాలో పద్మశాలి ఆడబిడ్డ పై హరీష్ రావు, కేటీఆర్ విషప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ వారి పై మండిపడ్డారు. మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన రాజకీయం హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పద్మశాలి ఆడబిడ్డ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కఠినంగా శిక్షించాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు జిందం గాలయ్య, నాయకులు కడవెరుగు గోపి, ఆలేటి సరోజన, దాసరపు లక్ష్మీ, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.


Similar News