క్రషర్ల అనుమతులను రద్దు చేయండి.. మాదారం గ్రామస్తులు
ప్రస్తుతం ఉన్న కంకర క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మరో 8 కొత్త క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, వీటి ఏర్పాటుతో తాము మరిన్ని ఇబ్బందులు పడతామని, కొత్త క్రషర్ల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ మాదారం గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కు విన్నవించారు.
దిశ, జిన్నారం : ప్రస్తుతం ఉన్న కంకర క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మరో 8 కొత్త క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, వీటి ఏర్పాటుతో తాము మరిన్ని ఇబ్బందులు పడతామని, కొత్త క్రషర్ల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ మాదారం గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కు విన్నవించారు. అనంతరం మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కంకర క్రషర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కొత్త క్రషర్లకు అనుమతులు ఇవ్వడం వల్ల మరిన్ని కష్టాలు ఎదురవుతాయని వివరించారు. తక్షణమే కొత్త అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ డివైజెస్ పార్క్ ను విస్తరించి మాదారం గ్రామ శివారు భూముల్లో కంకర క్రషర్లకు బదులుగా కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరామని తెలిపారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాదారం గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.