రేపటి నుంచి జిల్లాలో పోలీసు యాక్టు అమలు.. ఎస్పీ చెన్నూరి రూపేష్
జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు.
దిశ, సంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు (అక్టోబర్ 1వ తేది నుంచి 31 వరకు) 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందనన్నారు. కావున పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించాలని, అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తుల పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.