అర్ధరాత్రి అక్రమ మట్టి రవాణా.. 9 టిప్పర్ లారీలు సీజ్
అర్ధరాత్రి అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అటవీ
దిశ,తూప్రాన్ : అర్ధరాత్రి అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అటవీ ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 9 టిప్పర్ లారీ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల ప్రకారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం, పాలట గ్రామ శివారులో అర్ధరాత్రి అటవీ ప్రాంతం నుంచి భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి జరుగుతున్న రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పై పలు ఆరోపణలు వస్తున్నాయి.నమ్మదగిన సమాచారం మేరకు సీఐ రంగా కృష్ణ అర్ధరాత్రి అటవీ ప్రాంతానికి చేరుకుని మట్టిని తరలిస్తున్న 9 టిప్పర్ లారీలను పట్టుకుని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా అక్రమ మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.