'ప్రభుత్వానికి మంచి పేరు వస్తే హరీష్ రావు ఓర్వలేక పోతుండు..'

హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తే హరీష్ రావు ఓర్వలేకపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ అన్నారు.

Update: 2024-09-30 16:59 GMT

దిశ, చిన్నకోడూరు : హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తే హరీష్ రావు ఓర్వలేకపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులో భూనిర్వాసితులను ఎంతోమందిని రాత్రికి రాత్రే దౌర్జన్యంగా కాళీ చేయించిన ఘనత హరీష్ రావుకే దక్కిందన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో అక్రమంగా ఆక్రమిస్తే నోటీసులు ఇచ్చి కూల్చివేస్తే ఆక్రమం ఆనడం విడ్డూరంగా ఉందన్నారు.

హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో గ్రామాలు ఏడ్చి గగ్గోలు పెట్టిన ప్రజల మనోభావాలను పట్టించుకోలేదన్నారు. నాలాలను ఆక్రమించిన వారి కట్టడాలని తీసేస్తే హరీష్ రావుకు ఎందుకు బాధ అన్నారు. నాలాలో ఇల్లు పోయిన పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందన్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేసింది మీరు కాదా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొరిమిరాజు, ఉడుత జయంత్, సింగరాల రాజు, బత్తిని గణేష్, కొమ్ము ప్రశాంత్, గుడిమల్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.


Similar News