మున్సిపల్ కమిషనర్ మరో పెళ్లి..!

భార్య ఉండగా రెండవ పెళ్ళి చేసుకున్న మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ పై హైదారాబాద్ లోని ఓయూ పోలీస్ స్టేషన్ లో మొదటి భార్య ఫిర్యాదు చేసింది.

Update: 2024-09-30 16:55 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : భార్య ఉండగా రెండవ పెళ్ళి చేసుకున్న మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ పై హైదారాబాద్ లోని ఓయూ పోలీస్ స్టేషన్ లో మొదటి భార్య ఫిర్యాదు చేసింది. మెదక్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జానకి రామ్ కు భార్య కళ్యాణి ఉంది. ఆమె ఉండగానే కమిషనర్ మరో పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. భర్త రెండో పెళ్లి విషయం తెలిసిన కళ్యాణి భర్తను నిలదీసింది. ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో కారులో తీసుకువెళ్లి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు కళ్యాణ కుటుంబీకులు 100కు రక్షణ కోసం సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జానకి రామ్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. రెండో పెళ్లి పై కళ్యాణి ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ భార్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు.


Similar News